ప్రధాని మోదీ అత్యవసర భేటీ..!

దేశవ్యాప్తంగా కరోనా భీభత్సం సృష్టిస్తుంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ పైన ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ రాత్రి ఎనమిది గంటలకి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా నియంత్రణకి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపైన మోదీ చర్చించనున్నారు. ఈ క్రమంలో మోదీ కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.
అటు దేశవ్యాప్తంగా వరుసగా మూడో రోజు కొవిడ్ కేసులు రెండు లక్షలకు పైనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 14లక్షల 95 టెస్టులు చేయగా 2లక్షల 34వేల 692 కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 45లక్షల 26వేల 609కు చేరింది. కొత్తగా లక్షా 23వేల 354 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య కోటి 26లక్షల 71వేల 220 చేరింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 87.80 శాతంగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com