Visakha: విశాఖలో ప్రధాని.. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టి..

PM Modi: విశాఖ సభ వేదికగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు సీఎం జగన్. విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్ విజ్ఞప్తులు పరిశీలించాలని కోరారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు అవసరమని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం విడిపోయిన నాటి గాయం ఇంకా మానలేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. శక్తి మేరకు పనిచేస్తున్నామని.. కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు అతీతమని జగన్ అన్నారు.
తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన ప్రధాని మోదీ
తెలుగు ప్రజలందరికీ నమస్కారం అంటూ ప్రసంగం
విప్లవ వీరుడు అల్లూరి 120వ జయంతికి ఏపీకి వచ్చే అవకాశం దక్కింది
భారతదేశంలోనే విశాఖ ఒక ప్రత్యేకమైన నగరం
విశాఖ ప్రాచీన భారతదేశపు ప్రధాన ఓడరేవు
ఏపీ, విశాఖ ఆంకాక్షలు నెరవేర్చేలా..
రూ.10వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉపయోగపడతాయి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎప్పుడూ ఏపీ అభివృద్ధి గురించే మాట్లాడేవారు
ఏపీ అభివృద్ధిపై వారికి ఉన్న ఆకాంక్షలకు కొలమానం లేదు
ఏపీ ప్రజలకు ఒక ప్రత్యేకత ఉంది.. స్నేహపూర్వకంగా, వ్యాపార దక్షత కలిగిన వ్యక్తులు
సాంకేతిక, వ్యాపార, వైద్య, అన్ని రంగాల్లో ఏపీ ప్రజలకు ప్రత్యేక గుర్తింపు ఉంది
స్వతంత్ర భారత అమృతోత్సవంలో భాగంగా మరింత వికాసం దిశగా ముందుకెళ్తున్నాం
మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రభుత్వ దార్శనికత కనిపిస్తుంది
సమ్మిళిత అభివృద్ధి పట్ల మా దృష్టి స్పష్టం అవుతుంది
రైల్వేలు, రోడ్లు బహుముఖ అభివృద్ధికి అత్యంత కీలకం
మౌలిక సదుపాయాల అభివృద్ధిలో తమకు ఎలాంటి సందేహం లేదు
ఏకీకృత ఆలోచనలతో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశాం
ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి..
ఫిషింగ్ హార్బర్, ఆరులేన్ల రోడ్లను ప్రారంభిస్తున్నాం
మిషన్ గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది
బహుముఖ రవాణా వ్యవస్థ ద్వారా నగరాల భవిష్యత్ మెరుగుపడుతుంది
విశాఖలో ఇది మరింత వేగంగా ముందుకు వెళ్తుంది
ఇవాళ్టి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కోసం ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు
క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థలతో ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి
నిత్యావసర సరుకులు, ఇంధన కొరతతో పలు దేశాలు ఇబ్బంది పడుతున్నాయి
ఈ సమయంలో భారతదేశం కొత్త ఉన్నత శిఖరాలకు ఎదుగుతోంది
ప్రపంచ దేశాలు మనవైపే ఆసక్తిగా చూస్తున్నాయి
భారత పౌరుల ఆశలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నందునే ఇది సాధ్యమైంది
జీఎస్టీ, నేషనల్ ఇన్‌ఫ్రా పైప్‌లైన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెట్టుబడులు పెంచడంతో పాటు..
మరోపక్క పేద వాళ్ల సంక్షేమం కోసం గరీబ్ కల్యాణ్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం
వెనకబడిన జిల్లాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం
రెండున్నరేళ్లుగా పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నాం
మూడున్నరేళ్లుగా ప్రధాని కిసాన్ సమ్మాన్‌నిధి కింద రూ.6వేలు అందిస్తున్నాం
యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం
ఆధునిక సాంకేతికలో కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాం
సముద్రపు లోతుల్లోంచి ఇంధనాన్ని వెలికితీయడం ఒక మచ్చుతునక మాత్రమే
రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నాం
ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ ద్వారా మత్స్యకారుల జీవితం మరింత సౌలభ్యం కానుంది
పేదల శక్తి పెరిగి, ఆధునిక సౌకర్యాలు అందినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది
సముద్ర తీరాలు మన సమృద్ధికి ముఖ్య ద్వారాలు
తీర ప్రాంతాల అభివృద్ధికి వేల కోట్ల ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి
తీర ప్రాంత ప్రాజెక్టులను మరింతగా విస్తరిస్తాం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com