PM-Kisan: అన్నదాతలకు ప్రధాని మోదీ తీపికబురు..!

PM-Kisan: రైతులకి ఆర్ధిక సహాయం చేసేందుకు మోదీ సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే ఈ పథకాన్ని మందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పధకం కింద రైతులకి ప్రతి ఏడాది 3 విడతల్లో రూ.2వేల చొప్పున రూ.6 వేలు ఖాతాల్లో డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏడు విడతలుగా నిధులని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎనిమిదో విడత ఆర్థిక సాయాన్ని శుక్రవారం విడుదల చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం ట్వీట్ చేశారు..రేపు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 9.5 కోట్ల రైతు కుటుంబాలకు రూ.19,000 కోట్ల సాయం అందుతుందన్నారు.
प्रधानमंत्री श्री @narendramodi जी, 14 मई 2021 प्रातः 11:00 बजे #PMKisan योजना के तहत देश के 9.5 करोड़ किसानों के खातों में 8वीं किस्त के तौर पर रु. 19,000 करोड़ की राशि DBT के माध्यम से हस्तांतरित करेंगे...
— Narendra Singh Tomar (@nstomar) May 13, 2021
इस इवेंट से लाइव जुड़ने के लिए रजिस्टर करें : https://t.co/8IRCLWb674 pic.twitter.com/EtuyV09Fmf
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com