PM Narendra Modi: ప్రధాని మోదీ ఫిట్‌నెస్ సీక్రెట్స్.. 72 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా..

PM Narendra Modi: ప్రధాని మోదీ ఫిట్‌నెస్ సీక్రెట్స్.. 72 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా..
PM Narendra Modi: ప్రధాని మోదీ ఈరోజు తన 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నరేంద్ర మోదీ తన రోజును యోగాతో ప్రారంభిస్తారు. మోదీకి గుజరాతీ వంటకాలంటే చాలా ఇష్టం.

PM Narendra Modi: ప్రధాని మోదీ ఈరోజు తన 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నరేంద్ర మోదీ తన రోజును యోగాతో ప్రారంభిస్తారు. మోదీకి గుజరాతీ వంటకాలంటే చాలా ఇష్టం. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ప్రధాని మోదీ తన 72వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

నరేంద్ర మోడీ గొప్ప అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త మాత్రమే కాదు, అతను తన ఫిట్‌నెస్‌తో దేశంలోనే కాక ప్రపంచంలో కూడా పేరు పొందాడు. రాజకీయాల్లోనే కాకుండా ఫిట్‌నెస్ పరంగా కూడా గ్లోబల్ ఐకాన్‌గా నిలిచారు.

దేశంలోని యువతకు ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించేందుకు 'ఫిట్ ఇండియా మూవ్‌మెంట్' ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇంత బిజీలో కూడా ప్రధాని మోదీ తనను తాను ఎలా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన డైట్ షెడ్యూల్ ఎలా ఉంటుందో ఇక్కడ చూద్ధాం..

ప్రధాని మోదీ నిత్యం యోగా చేస్తుంటారు, అందుకే 'అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని' ప్రారంభించారని మనందరికీ తెలుసు. ఆయన వల్లే నేడు ప్రపంచమంతా యోగాను అవలంబిస్తోంది. యోగా ఆరోగ్యంగా ఉండటానికి దినచర్యలో భాగం చేసుకోవాలని చెబుతారు.

ప్రతిరోజూ ఉదయం నడుస్తారు, ధ్యానం చేస్తారు. దీనితో పాటు అనేక రకాల యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం కూడా చేస్తారు. ఏళ్ల తరబడి ఆరోగ్యంగా ఉండడానికి ఇదే పెద్ద రహస్యం. మోడీ తరచుగా తన యోగా వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. యోగా ద్వారా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చని చాలా సందర్భాల్లో చెబుతుంటారు.

రెండేళ్ళ క్రితం కరోనా కారణంగా దేశం లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు, మోడీ తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ఇంట్లో యోగా చేసేవారు. ఆ సమయంలో అతను 'మన్ కీ బాత్'లో తన ఫిట్‌నెస్ రొటీన్ గురించి ప్రజలకు చెప్పాడు.

అనేక రకాల యోగా వీడియోలు కూడా షేర్ చేయబడ్డాయి మరియు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కోరారు. అతను ట్వీట్ చేస్తూ, 'నేను ఫిట్‌నెస్ నిపుణుడిని లేదా వైద్య నిపుణుడిని కాదు. యోగా సాధన చాలా సంవత్సరాలుగా నా జీవితంలో అంతర్భాగంగా ఉంది అని పోస్ట్ చేశారు.

ప్రధాని మోదీ డైట్ సీక్రెట్.. మోదీ స్ట్రిక్ట్ డైట్ పాటిస్తారు. శాఖాహారం భుజిస్తారు. సమతుల్య ఆహారం తీసుకుంటారు. గుజరాతీకి చెందిన వ్యక్తి కావడంతో అక్కడి వంటకాలనే ఇష్టపడతారు. అతనికి అత్యంత ఇష్టమైన ఆహారం కిచిడీ. అలాగే, ప్రతిరోజూ ఆహారంలో కచ్చితంగా ఒక కప్పు పెరుగును చేర్చుకుంటారు.

ఒక ఇంటర్వ్యూలో పుట్టగొడుగులు మరియు పరాటాలను కూడా తన ఆహారంలో చేర్చుకుంటానని చెప్పారు. పుట్టగొడుగులలో అనేక రకాల పోషకాలు ఉంటా. ఇవి అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి అని తెలిపారు. అంతే కాదు మునగ ఆకును కూడా ఆహారంలో తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

గత 35 ఏళ్లుగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉపవాసం ఉంటున్నట్లు మోదీ చెప్పారు. 2014లో నవరాత్రి సందర్భంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన ఉపవాసం విరమించకుండా కేవలం నిమ్మరసం మాత్రమే సేవించినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story