కరోనా పరిస్థితులపై నేడు ప్రధాని మోదీ కీలక సమావేశాలు..!

కరోనా పరిస్థితులపై నేడు ప్రధాని మోదీ కీలక సమావేశాలు..!
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో.. వైరస్‌ కట్టడికి కేంద్రం మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో.. వైరస్‌ కట్టడికి కేంద్రం మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 3 గంటల్లో 3 అత్యున్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటారు. మొదట ఉదయం 9 గంటలకు కోవిడ్‌పై అత్యున్నత స్థాయి సమావేశం.. అది పూర్తి కాగానే 10 గంటలకు కోవిడ్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం పన్నెండున్నరకు ఆక్సిజన్ మేనిఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. దీని తర్వాత మరిన్ని సమావేశాలుంటాయని తెలుస్తోంది. ఈ కీలక సమావేశాలు ఉండటంతో మోదీ ఇవాల్టి బెంగాల్ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కరోనా పరిస్థితిని సమీక్షించడానికి ఇవాళ అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ కారణంగానే బెంగాల్‌కు వెళ్లడం లేదంటూ ట్వీట్ చేశారు మోదీ.

Tags

Read MoreRead Less
Next Story