Narendra Modi : బుద్ధపూర్ణిమ సందర్భంగా నేపాల్‌ వెళ్లిన ప్రధాని మోదీ

Narendra Modi :  బుద్ధపూర్ణిమ సందర్భంగా నేపాల్‌ వెళ్లిన ప్రధాని మోదీ
X
Narendra Modi : బుద్ధపూర్ణిమ సందర్భంగా ఇవాళ నేపాల్‌ వెళ్లారు ప్రధాని మోదీ. లుంబిని బౌద్ధ క్షేత్రాన్ని మోదీ సందర్శిస్తారు.

Narendra Modi : బుద్ధపూర్ణిమ సందర్భంగా ఇవాళ నేపాల్‌ వెళ్లారు ప్రధాని మోదీ. లుంబిని బౌద్ధ క్షేత్రాన్ని మోదీ సందర్శిస్తారు. నేపాల్‌తో బంధం మరింత బలపడేలా.. నేపాల్‌ ప్రధాని బహదూర్‌ దేవ్‌బాతో పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు.

ముఖ్యంగా జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, ఇరు దేశాల మధ్య రాకపోకలకు సంబంధించిన రవాణా, నేపాల్‌లో మౌలిక వసతుల ఏర్పాటుకు సాయం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయని విదేశాంగ శాఖ తెలిపింది. నెల క్రితం భారత్‌ వచ్చిన నేపాల్‌ ప్రధాని.. ఇవే అంశాలపై మోదీతో చర్చలు జరిపారు.

ప్రస్తుత నేపాల్‌ పర్యటనతో ఈ ఒప్పందాలపై కీలక ముందడుగు పడనుంది. పర్యటన సందర్భంగా లుంబినితో పాటు మాయాదేవి ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు మోదీ.

Tags

Next Story