చిరువ్యాపారులకు ఊరట.. అకౌంట్‌లో రూ.10,000

చిరువ్యాపారులకు ఊరట.. అకౌంట్‌లో రూ.10,000
ఇకపై ఎస్‌బీఐ కూడా ఇముద్రా ప్లాట్‌ఫామ్ ద్వారా లోన్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఎవరి మీదా ఆధారపడకుండా ఏదో ఒకటి చేసుకోవాలి. అందుకోసం కొంతైనా పెట్టుబడికావాలి. అయిన వాళ్లని అడుగుదామన్నా వారి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటి వారికి ఆసరాగా నిలుస్తోంది పీఎం స్వనిధి స్కీమ్. ఇకపై ఎస్‌బీఐ కూడా ఇముద్రా ప్లాట్‌ఫామ్ ద్వారా లోన్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో కూడా పీఎం స్వనిధి స్కీమ్ కింద లోన్ పొందొచ్చు. ఇందుకోసం ఎస్బీఐ ఇ-ముద్రా పోర్టల్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ)ను లాంచ్ చేసింది. 50 లక్షల మంది వెండర్లకు ప్రయోజనం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. లోన్ కింద తీసుకున్న రుణాన్ని ఈఎంఐ రూపంలో కడుతూ రావాలి. ఏడాది గడువులో రుణం మొత్తాన్ని చెల్లించాలి. ఈ తరహా రుణాలపై కేంద్ర ప్రభుత్వం 7 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తుంది. అంతే కాకుండా ప్రతి నెలా సమయానికి ఈఎంఐ కట్టే వారికి ఏడాదిలో రూ.1200 క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఈ స్కీమ్ ప్రవేశ పెట్టిన తరువాత ఇప్పటి వరకు 7.85 లక్షల రుణాలు మంజూరు అయ్యాయి. బ్యాంకులో లోన్ తీసుకోదలచిన వారు https://emudra.sbi.co.in:8044/emudra ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story