డిగ్రీ, పీజీ, డిప్లొమా అర్హతలతో 'పీఎన్‌బీ'లో ఉద్యోగాలు.. పొడిగించిన దరఖాస్తు గడువు

భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిని ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులు రిస్క్, క్రెడిట్, ట్రెజరీ, లా, ఆర్కిటెక్ట్, సివిల్, ఎకనామిక్, హెచ్‌ఆర్ విభాగాల్లో ఉన్నాయి. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 29 తోనే ముగిసినప్పటికీ తాజాగా ఆ గడువును అక్టోబర్ 6 వరకు పొడిగించారు. మొత్తం ఖాళీలు: 535
మేనేజర్ రిస్క్-160
మేనేజర్ క్రెడిట్ - 200
మేనేజర్ ట్రెజరీ - 30
మేనేజర్ లా - 25
మేనేజర్ సివిల్ - 08
మేనేజర్ ఎకనామిక్ - 10
సీనియర్ మేనేజర్ రిస్క్ - 40
సీనియర్ మేనేజర్ క్రెడిట్ - 50
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, సీఏ/ ఐసీడబ్ల్యుఏ/ఎంబీఏ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్ధిష్ట అనుభవం ఉండాలి.
వయసు: పోస్టులను బట్టి 25-37 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 08,2020
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 06,2020
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.175, మిగిలిన వారికి రూ.850
ఆన్‌లైన్ పరీక్ష తేదీ : అక్టోబర్/నవంబర్
వెబ్‌సైట్: https://www.pnbindia.in/
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com