అసెంబ్లీ ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారంపై దృష్టి సారిస్తా : మమతా బెనర్జీ

అసెంబ్లీ ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారంపై దృష్టి సారిస్తా : మమతా బెనర్జీ
ప్రజల కష్టాలను ప్రధాని రామాయణంలోని సన్నివేశాలతో పోల్చి చెప్పారు.

బెంగాల్ పాలిటిక్స్ క్లైమాక్స్‌కు చేరాయి. బీజేపీ,టీఎంసీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. దీదీ గడ్డపై ఆమేకే గట్టి కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ. పశ్చిమ బెంగాల్‌ పురులియాలో ఎన్నికల ప్రచారం చేసిన మోదీ.. పదేళ్లపాటు బెంగాల్‌ ప్రజలతో మమతా బెనర్జీ ఆడుకుందని.. ఇక చాలు అని ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ప్రజల కష్టాలను ప్రధాని రామాయణంలోని సన్నివేశాలతో పోల్చి చెప్పారు. మమతా నేతృత్వంలో పదేళ్లపాటు బెంగాల్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. టీఎంసీ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బిజెపి అధికారంలోకి రాగానే తప్పుడు పాలన అందించిన టీఎంసీ నేతలను శిక్షిస్తామని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి సాధించాలన్నా.. ప్రజల నీటి కష్టాలు తీరాలన్నా బిజెపికి పట్టం కట్టాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు.

అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత కేంద్రంలో అధికారంపై దృష్టి సారిస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలో నుంచి తప్పిస్తామని ప్రమాణం చేశారు. పరివర్తన్‌ అంటూ తాను ఇచ్చిన నినాదాన్ని బీజేపీ దొంగిలించిందని, దాన్ని అసోల్‌ పరివర్తన్‌ అంటూ రీమోడలింగ్‌ చేసిందని విమర్శించారు. పశ్చిమ మేదినీపూర్‌ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

మార్చి 27 నుంచి రాష్ట్రంలో ఎనిమిది దశల ఎన్నికలు జరుగనున్నాయి. 2019 జాతీయ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ప్రస్తుత ఎన్నికల్లో 200 సీట్లకు పైగా గెలువాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అటు టీఎంసీ ప్రజాకర్షక స్కీంలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది

Tags

Read MoreRead Less
Next Story