మమతాబెనర్జీ పెద్ద 'రిగ్గింగ్ క్వీన్' : బీజేపీ నేతలు

మమతాబెనర్జీ పెద్ద రిగ్గింగ్ క్వీన్ : బీజేపీ నేతలు
మమతాబెనర్జీని 'రిగ్గింగ్ క్వీన్'గా అభివర్మించారు బీజేపీ నేతలు.

పశ్చిమబెంగాల్ లో పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీ, అమిత్‌షా వంటి బీజేపీ నేతల భవిష్యత్తును నిర్ణయిస్తాయని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈస్ట్ మిడ్నాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బీజేపీపై నిప్పులు కురిపించారు. దుష్టశక్తులతో సమష్టిగా మనమంతా కలిసి పోరాడాలని, బెంగాల్‌ను విడిగొట్టేందుకు వాళ్లు ఇక్కడకు వచ్చారని అన్నారు. అభ్యర్థులు ఎవరనేది చూడకుండా టీఎంసీ గుర్తు చూసి సోదర సోదరీమణులంతా ఓటు వేయాలని మమత కోరారు. టీఎంసీకి ఓటు వేయకుంటే బెంగాల్‌‌ విభజన జరగడంతో పాటు ప్రజలు ప్రశాంతగా బతకలేని పరిస్థితిని ప్రత్యర్థులు కల్పిస్తారని హెచ్చరించారు.

అటు మమతాబెనర్జీని 'రిగ్గింగ్ క్వీన్'గా అభివర్మించారు బీజేపీ నేతలు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటమంటే ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడంతో సమానమని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. ఇప్పుడుకూడా ఆమె అధికార యంత్రాగ్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, చొరబాటుదారులను, పాకిస్థానీయులను ప్రోత్సహిస్తున్నారు ఆరోపించారు.

అటు పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో రాష్ట్ర పోలీసులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పోలింగ్ బూత్‌లకు 100 మీటర్ల పరిధిలో రాష్ట్ర పోలీసులు ఉండకూడదనే ఆదేశాలేవీ తాము ఇవ్వలేదని తెలిపింది. రాష్ట్ర పోలీసులు పోలింగ్ బూత్‌ల నుంచి 100 మీటర్ల దూరంలో ఉండాలని ఈసీ ఆదేశించిందని టీఎంసీ ఆరోపించిన నేపథ్యంలో ఈసీ ఈ వివరణ ఇచ్చింది. టీఎంసీ ఆరోపణలను ఖండిస్తూ, పశ్చిమ బెంగాల్ పోలీసులపై తాము ఎటువంటి ఆంక్షలను విధించలేదని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story