రోజుకు రూ.100లు పొదుపు చేస్తే అవసరానికి రూ.5 లక్షలు..

రోజుకు రూ.100లు లేదా నెలకు రూ.3,000ల చొప్పున పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లో పొదుపు చేస్తే మెచ్యూరిటీ పీరియడ్ పూర్తయిన తరువాత మీ చేతికి రూ.5 లక్షలు అందుతాయి. మీరు కష్టపడి సంపాదించి పెట్టుబడి పెట్టిన డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి వస్తుంది. ఇందుకు చేయవలసిందల్లా దగ్గరలోని పోస్టాఫీస్‌కి వెళ్లి అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరిచి అందులో ప్రతినెలా డబ్బులు డిపాజిట్ చేయాలి. ప్రతి రోజూ కొంత మొత్తాన్ని తీసి పక్కన పెట్టి నెలకి ఒకసారి పోస్టాఫీస్‌కి వెళ్లి అకౌంట్లో వేయవచ్చు.
దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే స్కీమ్ ఇది. ఈ డిపాజిట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అవసరం అనుకుంటే ఆర్‌డీ అకౌంట్ మెచ్యూరిటీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. మీరు పెట్టే డబ్బుకు 5.8 శాతం వడ్డీ వస్తుంది. మరో ముఖ్యవిషయం ఏమిటంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుంది. రోజుకి వంద చొప్పున పదేళ్లు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.5 లక్షలు వస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com