Post Office Saving Scheme: పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్.. మీ సొమ్ము రెట్టింపు..

Post Office Saving Scheme:కష్టపడి సంపాదించిన సొమ్ము కష్టకాలంలో అక్కరకు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన పోస్టాఫీస్‌కు చెందిన సేవింగ్ స్కీమ్‌లో కిసాన్ వికాస్ పత్ర పథకం ఒకటి. ఈ సేవింగ్ స్కీమ్‌లో మీ సొమ్మును మదుపు చేస్తే 124 నెలల్లో అది రెట్టింపు అవుతుంది. డబ్బు సురక్షితంగా ఉంటుంది.
వడ్డీ రేటు.. పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర పథకం కింద 6.9 శాతం వడ్డీ అభిస్తుంది. ప్రతి ఏటా వడ్డీని కలుపుతారు. ఏప్రిల్ 1,2020 నుంచి ఈ వడ్డీ వర్తిస్తుంది.
ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు
కనీస పెట్టుబడి రూ.1000లు మొదలు, గరిష్టంగా ఎంతైనా మదుపు చేయవచ్చు.
ఖాతా తెరవడానికి ఎవరు అర్హులు..
పథకానికి సంబంధించి అకౌంట్‌లో ముగ్గురు సభ్యుల వరకు జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. పదేళ్ల వయసున్న మైనర్లు కూడా తమ పేరు మీద నేరుగా ఖాతా తెరవొచ్చు.
మెచ్యూరిటీ పీరియడ్
సమర్పించిన తేదీ నుండి 124 నెలలు (10 సంవత్సరాల 4 నెలలు) ఉంటుంది.
ఖాతా బదిలీ చేసే సందర్భాలు..
ఖాతాదారుడు మరణిస్తే, నామినీ లేదా చట్టపరమైన వారసుడికి ఖాతా బదిలీ చేయబడుతుంది.
ఖాతాదారుడు మరణిస్తే, ఖాతాను జాయింట్ హోల్డర్‌కు బదిలీ చేయవచ్చు.
కోర్టు ఆదేశాల మేరకు ఖాతా బదిలీ చేయవచ్చు.
అంతేకాకుండా ఖాతాను ఏదైనా అధికారి వద్ద తనఖా పెట్టవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com