పోస్టాఫీస్‌లో నెలకు రూ.500లు.. రిస్క్‌లేని స్కీమ్‌లు..

పోస్టాఫీస్‌లో నెలకు రూ.500లు.. రిస్క్‌లేని స్కీమ్‌లు..
ఎలాంటి రిస్క్ ఉండదు.. వీటిల్లో చేరడం వల్ల ఆకర్షణీయమైన రాబడిని కూడా పొందొచ్చు.

పోస్టాఫీస్‌లో పలు రకాల స్కీములు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి రిస్క్ ఉండదు.. వీటిల్లో చేరడం వల్ల ఆకర్షణీయమైన రాబడిని కూడా పొందొచ్చు. 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు డబ్బులు పోస్టాఫీసులో మదుపు చేయాల్సి ఉంటుంది. ఇవి అందించే పలు రకాల స్కీమ్‌లు PPF, రికరింగ్ డిపాజిట్ RD, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ NSC, టైమ్ డిపాజిట్ TD వంటి వాటిల్లో డబ్బులు పెట్టి మంచి రాబడి పొందొచ్చు. పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. TD చేస్తే 6.7 శాతం వడ్డీ వస్తుంది. రికరింగ్ డిపాజిట్‌లో డబ్బులు పెడితే 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఎన్ఎస్‌సీ స్కీమ్‌లో చేరితే 6.8 శాతం వడ్డీ వస్తుంది. ఇవే కాకుండా మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సుకన్య స్కీమ్ వంటివి కూడా ఉన్నాయి.

ఉదాహరణకు మీరు పీపీఎఫ్ ఖాతాలో చేరాలనుకుంటే నెలకు రూ.1000 డిపాజిట్ చేస్తే మీకు మెచ్యూరిటీ తరువాత రూ.3 లక్షలకు పైగా లభిస్తాయి. పీపీఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు అని గుర్తుంచుకోవాలి. ప్రతి నెలా రూ.1000లు 15 ఏళ్ల పాటు కట్టాలి.

Tags

Read MoreRead Less
Next Story