PPF: పీపీఎఫ్ లో నెలకు రూ.12వేలు పెట్టుబడి పెడితే. 15 ఏళ్ల తరువాత..

PPF: పీపీఎఫ్ లో నెలకు రూ.12వేలు పెట్టుబడి పెడితే. 15 ఏళ్ల తరువాత..
రిస్క్ లేని ఇన్వెస్మెంట్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకాన్ని చెప్పుకోవచ్చు.

PPF: రిస్క్ లేని ఇన్వెస్మెంట్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకాన్ని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, అధికారులు పదవీ విరమణ తరువాత భారీ మొత్తంలో నగదు చేతికి అందుతుంది. దీనికి ఆదాయం పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఇందులో కొంత మొత్తాన్ని పీపీఎఫ్ లో పెట్టుబడి పెడితే ప్రతి నెలా కొంత మొత్తం చేతికి అందుతుంది.

పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టిన మదుపర్లు ప్రతిఏటా ఆదాయం పన్ను (ఐటీ) చట్టం -61 ప్రకారం తమ ఐటీ రిటర్న్స్ లో పన్ను మినహాయింపు కోరవచ్చు. ప్రభుత్వ మద్దతుతో అమలవుతున్న ఈ చిన్న మొత్తాల పొదుపు పథకంతో ఎలాంటి రిస్క్ ఉండదు.

పీపీఎఫ్ కింద పెట్టే పెట్టుబడులపై కేంద్ర ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని సవరిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ఉన్న వారికి 7.1 శాతం వడ్డీ రేటు అందుతోంది.

ఇతర పన్ను మినహాయింపు పథకాలతో పోలిస్తే అధిక వడ్డీ రేటు లభిస్తుంది. పీపీఎఫ్ కింద గరిష్టంగా ప్రతిఏటా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు.

పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏండ్లు. ఉదాహరణకు నెలకు రూ.12 వేలు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏండ్లు పూర్తయిన తరువాత అది రూ.39,05,480.85 అవుతుంది.

25 ఏండ్ల వయసులో పీపీఎఫ్ లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెడితే మీకు 40 ఏండ్లు వచ్చేటప్పటికి మెచ్యూరవుతుంది. తదుపరి పెట్టుబడి పెట్టకుండా 55 ఏండ్ల వరకు ఈ ఖాతా కొనసాగించవచ్చు. అలా కొనసాగించినట్లైతే మీరు పెట్టిన రూ.39 లక్షల పెట్టుబడి రూ.1.09 కోట్లవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story