పెళ్లికి వేళాయే.. పొలిటీషియన్ మనసు దోచిన యాంకర్.. !!

ప్రదీప్ మాచిరాజు.. నవ్వుల రారాజు.. మహిళా యాంకర్లలో సుమకి ఎంత పేరు వచ్చిందో.. మేల్ యాంకర్లలో ప్రదీప్ అంతే పేరు తెచ్చుకున్నాడు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ప్రదీప్ పేరు ఉన్నప్పటికీ పెళ్లంటే ఆమడ దూరం పారిపోతుంటాడు. అతడు పెళ్లి చేసుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్న వాళ్లు ప్రదీప్ కనిపిస్తే చాలు పెళ్లెప్పుడంటూ ప్రశ్నలతో వేధిస్తుంటారు.. మరి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టదలిచాడో ఏమో.. రాయలసీమకు చెందిన ఓ రాజకీయనాయకుడి కుమార్తె, యంగ్ పొలిటీషియన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. మరో మూడు నెలల్లో ప్రదీప్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. తన పెళ్లికి సంబంధించిన సమాచారాన్ని అభిమానులకు త్వరలోనే తెలియజేయనున్నాడట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ప్రదీప్ స్పందించే వరకు ఆగాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com