నెలసరి ఆదాయం రూ.15,000.. అయితే ఈ పథకం మీలాంటి వారి కోసమే..

కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్న పథకం ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన. దీన్ని ప్రధాని మోదీ మంగళవారం అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. నెలసరి ఆదాయం రూ.15 వేలు పొందుతున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అసంఘటిత కార్మికులు అంటే ఇళ్లలో పని చేసే వారు కావచ్చు, కూలీ పనులు చేసే వారు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు, రోజు వారీ వేతనం తీసుకునే వారు వీరందరికి ఈ పథకం క్రిందకు వస్తారు.
కార్మిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 40 సంవత్సరాల లోపు వయసు ఉన్న కార్మికులు మాత్రమే ఈ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు వుంటుంది. వీరికి 60 ఏళ్లు పూర్తి అయిన తరువాత నెలకు 3 వేల రూపాయల పింఛను అందుతుంది.
18 ఏళ్ల వయసు పైబడిన వారు ఈ పథకానికి వర్తించరు. వీరు నెలకి రూ.55లు ప్రీమియం కట్టాలి.
29 ఏళ్ల వయసు పైబడిన వారు రూ.100 లు కట్టాలి. 40 ఏళ్ల పైబడిన వారు నెలకు రూ.200లు కట్టాలి. అయితే ఈ పథకంలో చేరాలంటే కచ్చితంగా 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే స్కీంలో జాయిన్ అవ్వాలి. మీరు డిపాజిట్ చేసిన మొత్తం డబ్బును ప్రభుత్వం మీ పేరుతోనే జమ చేస్తుంది.
ఈ పథకంలో చేరాలనుకునే ఏ వ్యక్తి అయినా ఆధార్ కార్డు, బ్యాంకులో ఖాతా తెరిచి ఉండాలి. ఇంకా ఈ పథకానికి సంబంధించిన మరింత సమాచారం కావాలంటే 1800 2676 888 టోల్ ఫ్రీకి కాల్ చేసి తెలుసుకోవచ్చు.
నేషనల్ పెన్షన్ పథకం, ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ పథకం లేదా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో ఉన్న వారికి అర్హత లేదు. ఆదాయపు పన్ను ఎవరైతే కడుతుంటారో వారంతా కూడా అనర్హులు అని ప్రకటించింది.
ఈ స్కీంలో ఉన్న సభ్యుడు అనివార్య కారణాల వలన మరణిస్తే భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. ఒకవేళ ఈ పథకం నుంచి ఆమె లేదా అతడు బయటకు రావాలనుకుంటే ఉపసంహరించుకోవచ్చు. జీవిత భాగస్వామి పింఛనులో 50 శాతం పొందుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com