జస్ట్ ఆస్కింగ్.. ఒక్క సినిమాకే కంగనా..: ప్రకాష్ రాజ్ కౌంటర్

జస్ట్ ఆస్కింగ్.. ఒక్క సినిమాకే కంగనా..: ప్రకాష్ రాజ్ కౌంటర్
మొత్తానికి కంగనా హీరోయిన్ గా వచ్చిన పాపులారిటీ కంటే ఇప్పడు ఈ కొత్త వివాదంతో తన పేరు దేశం మొత్తం తెలిసేలా చేసుకుంది.

తను చేస్తున్న పని ఇతరులకి నచ్చాలని అనుకోలేదు.. తనకి చేయాలనిపించింది చేస్తుంది. అందుకు ఆమెను పొగిడేవారు కొందరైతే.. విమర్శించే వారు మరి కొందరు.. మొత్తానికి కంగనా హీరోయిన్ గా వచ్చిన పాపులారిటీ కంటే ఇప్పడు ఈ కొత్త వివాదంతో తన పేరు దేశం మొత్తం తెలిసేలా చేసుకుంది. అధికార పార్టీ మద్ధతుతో ఆమె అడుగులు వడి వడిగా పడుతున్నాయని విమర్శించే వారు చాలా మందే ఉన్నారు. ఏదేమైనా ఆమె పోరాటం హర్షనీయం. ఇదిలా ఉంటే తమిళ నటుడు విశాల్ ఆమెను భగత్ సింగ్ తో పోల్చారు.. ఆమె ధైర్యానికి మెచ్చుకున్నారు. మరో నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం కంగనా తీరును విమర్శిస్తున్నారు.

జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించే ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో కంగనా మీద వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. కంగన తీరును తప్పుబట్టిన ఆయన ఒక సినిమాకే కంగన తనను తాను రాణీ లక్ష్మీబాయ్ అనుకుంటే ఎలా.. ఆ మాటకొస్తే పద్మావత్ లో చేసిన దీపకా పదుకొనె, జోథా అక్బర్ లో నటించిన హృతిక్, అశోక చిత్రంలో చేసిన షారుఖ్ ఖాన్, భగత్ సింగ్ లో నటించిన అజయ్ దేవగణ్, మంగళ్ పాండేగా నటించిన ఆమిర్ ఖాన్, మోదీగా నటించిన వివేక్ ఒబెరాయ్ ఏమనుకోవాలి అని ఓ పోస్టర్ ను షేర్ చేశారు. కంగన వ్యవహార శైలి తనకేం నచ్చట్లేదని ఇన్ డైరక్టుగా విమర్శిస్తున్నారు. మరి కంగన ఆయన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తుందో లేదో చూడాలి.

Tags

Next Story