కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్.. నిన్న రాహుల్ నివాసంలో సుదీర్ఘంగా సాగిన సమావేశం..!

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత.. ప్రస్తుతానికి ఇదైతే ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది. నిన్న రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో PK పార్టీలో చేరడంపై చర్చ జరిగినట్టు లీకులు వస్తున్నాయి. నిన్నటి భేటీలో సోనియా, రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. రాబోయే పంజాబ్, యూపీ ఎన్నికల గురించి చర్చించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.
అలాగే తమిళనాడు, బెంగాల్ ఫలితాల్నీ PK గాంధీల వద్ద విశ్లేషించారు. ఐతే.. వీటికంటే ముఖ్యమైన అంశంపై చర్చ జరిగిట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో పీకే క్రియాశీల పాత్ర పోషిస్తారనే మాట కూడా వినిపిస్తోంది. అలాగే పార్టీలో ప్రశాంత్ కిషోర్‌కి ఎలాంటి స్థానం కల్పిస్తారో కూడా చర్చకు వచ్చిందంటున్నారు.
బీజేపీయేతర పార్టీల్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. శరద్ పవార్ నేతృత్వంలో ఇప్పటికే మూడుసార్లు సమావేశాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్‌ని PK కలవడం ఆసక్తికరంగా మారింది. ఐతే.. ఆయన పార్టీలో చేరతారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి సపోర్ట్ చేసేందుకు కెప్టెన్ అమరీందర్‌కు అడ్వైజర్‌గా ఉన్న PK.. తన టీమ్‌కు ఇప్పటికే యాక్షన్‌లోకి దింపారు. అదయ్యాక 2024 టార్గెట్‌గా వ్యూహం ఉంటుందని, కాంగ్రెస్ ముఖ్యనేతలతో త్వరలో మరిన్ని సమావేశాలు జరగుతాయని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com