Pre Wedding Photoshoot: ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లో సడెన్ ట్విస్ట్..

Pre Wedding Photoshoot: ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లో సడెన్ ట్విస్ట్..
Pre Wedding Photoshoot: ఈరోజుల్లో ట్రెండింగ్‌గా ఉన్న దైనికోసమైనా వెనక ముందు ఆలోచించకుండా అడుగేస్తున్నారు కొందరు.

Pre Wedding Photoshoot: ఈరోజుల్లో ట్రెండింగ్‌గా ఉన్న దైనికోసమైనా వెనక ముందు ఆలోచించకుండా అడుగేస్తున్నారు కొందరు. ఏదైనా కాస్త ట్రెండ్ అయితే చాలు.. వెంటనే దాన్ని ట్రై చేయాలని ఆరాటపడుతున్నారు. అలాంటి ఆరాటంలో ఏ తప్పు లేదు కానీ ఆ పని చేసే ముందు కాస్త ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నలుగురి ప్రాణం మీదకు వచ్చింది.

ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్‌కు ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగిపోయింది. పెళ్లికంటే ఈ షూట్‌ల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు కపుల్స్. వీటికోసం తెలియని ప్రదేశాలకు వెళుతున్నారు. వినూత్నంగా ఆలోచిస్తున్నారు. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే పెళ్లి లాంటి అంశం కోసం ఇలాంటివి చేయడం ఓకే.. కానీ కొందరు కపుల్స్ మాత్రం ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ ద్వారా రిస్క్‌లో పడుతున్నారు.

రానాప్రతాప్ సాగర్ డ్యామ్.. రాజస్థాన్‌లోని టూరిస్ట్ ప్లేస్‌లలో ఒక అందమైన చోటు. ఈ చోటులో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకోవాలని ఆశపడింది ఓ జంట. అందుకే ఫోటోగ్రాఫర్స్‌తో పాటు వారు అక్కడికి చేరుకున్నారు. కాసేపు ఫోటోషూట్ బాగానే సాగింది. కానీ ఇంతలోని ఒక్కసారిగా డ్యామ్ నాలుగు గేట్లు తెరుచుకుని వీరందరి పైకి వచ్చేశాయి.

అంత నీటిప్రవాహంలో ఫోటోగ్రాఫర్స్ ఇద్దరితో పాటు ఈ జంట కూడా చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న రావత్‌భతా పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ నలుగురి ఒక రాయిపై కూర్చుని ప్రాణాలు కాపాడుకున్నారు. కొట నుండి ఫోటోషూట్ కోసం డ్యామ్ దగ్గరకు వచ్చినట్టు వారు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story