అయోధ్య రామమందిర నిర్మాణానికి రాష్ట్రపతి రూ.5లక్షల విరాళం!

అయోధ్య రామ మందిర నిర్మాణానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విరాళం ఇచ్చారు. రాముల వారి ఆలయ నిర్మాణానికి 5,00,100 చెక్కును రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు అందజేశారు. దేశ తోలి పౌరుడిగా రాష్ట్రపతి నుంచే విరాళాల సేకరణ ప్రారంభించాలని విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది.
అందులో భాగంగానే రామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మొదలగు వారు ఈ రోజు ఉదయం రాష్ట్రపతిని కలిశారు. నిధి సేకరణలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోడీతో పాటుగా పలువురు ప్రముఖులను కలిసి విరాళాలు అడగనున్నారు.
జనవరి 15 నుంచి మొదలైన విరాళాల సేకరణ ఫిబ్రవరి 27న ముగియనుంది. రూ. 20వేలు అంతకంటే ఎక్కువ మొత్తం ఇచ్చే విరాళాన్ని చెక్కుల రూపంతో తీసుకోనున్నట్లు పేర్కొంది. అంతేగాక, రూ. 2వేల కంటే ఎక్కువ ఇచ్చిన వారికి రశీదు ఇవ్వాలని నిర్ణయించింది. అటు అయోధ్యలో ఆలయ నిర్మాణానికి మొత్తం రూ .1,100 కోట్లు ఉంటుందని ట్రస్ట్ అంచనా వేసింది .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com