పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధింపు

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గురువారం సంతకం చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి రిపోర్టు అందగానే నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. ఎల్జీ పంపిన రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలించినట్టు అధికారులు తెలిపారు. పుదుచ్చేరిలో పరిపాలన కొనసాగించడం సాధ్యం కాదని రిపోర్ట్‌లో ఎల్జీ పేర్కొన్నారు. రిపోర్ట్‌పై రాష్ట్రపతి సంతృప్తి చెందారని కార్యాలయం పేర్కొంది.
అటు.. కాంగ్రెస్-డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడం, ప్రతిపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్..రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంశాఖకు సిఫారసు చేశారు. హోంశాఖ పంపిన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు.
కాంగ్రెస్, డీఎంకేలకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సోమవారం జరిగిన బలపరీక్షలో నారాయణస్వామి విఫలమై.. సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో 14 మంది ఎమ్మెల్యేల బలమున్న ప్రతిపక్ష ఎన్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తుందేమోనని ఎల్‌జీ వేచిచూశారు. ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్.రంగస్వామి అందుకు విముఖత చూపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com