President Speech : "దేశంలో నేడు స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉంది"

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ బడ్జెట్ ప్రారంభ సమావేశం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా పార్లమెంట్ లో ప్రసంగించడం ఇదే తొలిసారి. భారతదేశంలో ఈ రోజు నిర్బయమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉందని అన్నారు రాష్ట్రపతి. త్వరలోనే ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తిచేసుకోనుందని చెప్పారు. ఈ రోజు భారతదేశం ప్రపంచంలోని అన్ని సమస్యలకు పరిష్కారం దిశగా ఎదుగుతోందని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడిన తన తొమ్మిదేళ్లలో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. నియంత్రణ రేఖ నుండి వాస్తవ నియంత్రణ రేఖ వరకు భద్రతను పటిష్టం చేసిందని తెలిపారు. ఆర్టికల్ 370, జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు, ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిందని చెప్పారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం యొక్క అతి పెద్ద శత్రువు అవినీతని అన్నారు. తన ప్రభుత్వం అవినీతిని నిర్మూలించడానికి అంతం చేయడానికి కఠిన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.
పేదరికం లేని భారత నిర్మాణం కోసం కృషి జరుగుతుందన్నారు రాష్ట్రపతి ముర్ము. రాబోయే 25ఏళ్లలో ప్రపంచమంతా భారత్ వైపు చూసే రోజు వస్తుందన్నారు. డిజిటల్ ఇండియా దిశగా భారత్ ముందుకెళ్తుందని, సాంకేతికతను అందిపుచ్చుకుని కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com