కోవిడ్ రోగులు త్వరగా కోలుకునేందుకు ఇంజక్షన్

కోవిడ్ రోగులు త్వరగా కోలుకునేందుకు ఇంజక్షన్
హైదరాబాద్ కు చెందిన ఓ ఫార్మా సంస్థకు వచ్చిన ఈ ఆలోచనతో అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ ఇంజక్షన్ తయారీకి పూనుకుంది.

కరోనా లక్షణాలు మధ్యస్థంగా ఉన్న రోగులకు ఫావిపిరవిర్ (200 ఎంజీ) ఔషధాన్ని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఈ మెడిసిన్ తీసుకున్న రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉందని ఫార్మా కంపెనీలు పేర్కొంటున్నాయి. అయితే ఇవి ట్యాబ్లెట్ల రూపంలో వాడితే బాధితులు 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 100 ట్లాబ్లెట్లు మింగాల్సి ఉంటుంది. 14 రోజుల పాటు ఈ వంద ట్లాబ్లెట్లను వాడాల్సి వస్తుంది. కొన్ని కంపెనీలు 400 ఎంజీ ట్యాబ్లెట్ తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అది ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ లోపు మరికొన్ని పరిశోధనా సంస్థలు అసలు ట్యాబ్లెట్ బదులు రోగులకు ఇంజెక్షన్ ఇస్తే ఎలా ఉంటుందని భావించాయి. హైదరాబాద్ కు చెందిన ఓ ఫార్మా సంస్థకు వచ్చిన ఈ ఆలోచనతో అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ ఇంజక్షన్ తయారీకి పూనుకుంది. త్వరలోనే దీన్ని తయారు చేసి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిసింది.

ఈ యాంటీ వైరల్ ఔషధాన్ని జపాన్ కు చెందిన టయోమా కెమికల్ కంపెనీ ఆవిష్కరించింది. ఇన్‌ఫ్లుయంజా వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారు. కొవిడ్ కు మందులు లేని పరిస్థితుల్లో ఫావిపిరవిర్ ను ఇచ్చి చూశారు.. అవి తీసుకున్న రోగులు త్వరగా కోలుకోవడాన్ని గమనించారు పరిశోధకులు. మనదేశంలో రెండు నెలల క్రితం ఫావిపిరవిర్ 200 ఎంజీ ట్యాబ్లెట్ ను గ్లెన్ మార్క్ ఆవిష్కరించింది. ఫలితం కనిపించడంతో 10కి పైగా ఫార్మా కంపెనీలు ఈ ఔషధ తయారీలో నిమగ్నమై ఉన్నాయి.

ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ తయారు చేస్తున్న ఔషధ సంస్థలు.. హెటిరో ల్యాబ్స్, ఆప్టిమస్ ఫార్మా, జనేరా ఫార్మా, లీ ఫార్మా, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, కన్‌వెర్జ్‌ బయోటెక్, మైలాన్ ల్యాబ్స్, వీవిమెడ్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, రాఘవ లైఫ్ సైన్సెస్.

Tags

Read MoreRead Less
Next Story