PM Modi: యువతకు ప్రధాని మోదీ దీపావళి కానుక

PM Modi: యువతకు ప్రధాని మోదీ దీపావళి కానుక
PM Modi: దేశవ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధాని మోదీ దీపావళి కానుక అందించారు.

PM Modi: దేశవ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధాని మోదీ దీపావళి కానుక అందించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం పొందిన 75 వేల మంది యువతకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నియామక పత్రాలు అందించారు.


ఈ సందర్భంగా పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే రోజ్‌గార్‌ మేళాను మోదీ ప్రారంభించారు. గడిచిన 8 ఏళ్లలో ఉద్యోగ, స్వయం ఉపాధి కల్పన విషయంలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు కీలక మైలురాయిగా రోజ్‌గార్‌ మేళా నిలిచిపోతుందన్నారు ప్రధాని మోదీ.

కరోనా సమయంలో ఉద్యోగ సంక్షోభం తలెత్తకుండా తీసుకున్న జాగ్రత్తలను మోదీ వివరించారు. MSME రంగాలకు 3 లక్షల కోట్లకు మించి సహాయం చేసినట్లు చెప్పారు. దీంతో కోటి 50 లక్షల ఉద్యోగాలను కాపాడినట్లు స్పష్టం చేశారు. టూరిజం, తయారీ రంగాల్లో ఉపాధికి అనేక అవకాశాలు ఉన్నాయన్న మోదీ.. ఈ రంగాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story