బ్రేకింగ్.. జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

కరోనాతో పోరాటంలో మనం చాలా దూరం ప్రయాణించాం..
దీనివల్ల మన జీవితాలు మందగమనంలో సాగాయి
ఇప్పుడిప్పుడే ప్రజలు మళ్లీ తమ రోజువారి పనులు చేసుకుంటున్నారు
అయితే లాక్‌డౌన్ వెళ్లిపోయినా... వైరస్ మాత్రం వెళ్లలేదని అందరూ గుర్తించాలి
కరోనా విషయంలో మన దేశంలో పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది
భారత్‌లో ప్రతి 10 లక్షల మందికి 80 మాత్రమే మరణించగా..
మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య 600 కు పైగానే ఉంది.
మన దేశంలో కరోనా రోగుల కోసం 90 లక్షలకు పైగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయి
12 వేల క్వారంటైన్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయి.
2 లక్షలకు పై కరోనా టెస్టు సెంటర్లు ఉన్నాయి
దేశంలో కరోనా టెస్టుల సంఖ్య త్వరలోనే 10 కోట్లు దాటనుంది
కరోనాపై పోరాటంలో కరోనా టెస్టుల సంఖ్య కీలకమైంది
సేవో పరమ ధర్మః అన్న నినాదంతో అనేక మంది సేవలు అందించారు
ఇది నిర్లక్ష్యంతో వ్యవహరించాల్సిన సమయం ఎంతమాత్రం కాదు
కరోనా వెళ్లిపోయింది... ఇక భయపడాల్సిన పనిలేదని ఎవరూ భావించవద్దు
ప్రజలు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే.. మాస్కులు లేకుండా బయటకు వస్తే..
మీమ్ముల్ని మీరు.. మీ కుటుంబాలను.. ఇతరులను ప్రాణాపాయంలో పడేసినట్లే
ఇతర దేశాల్లో ఇదే పరిస్థితి తలెత్తుతోంది..
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com