Modi Get's Emotional : ఆజాద్ సహృదయాన్ని వర్ణించడానికి మాటల్లేవంటూ సెల్యూట్ చేసిన మోదీ!

X
By - TV5 Digital Team |9 Feb 2021 2:57 PM IST
Modi Get's Emotional : గులాం నబీ ఆజాద్ లాంటి వ్యక్తులు, నాయకులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి మోదీ రాజ్యసభలో కొనియాడారు.
Modi Get's Emotional : గులాం నబీ ఆజాద్ లాంటి వ్యక్తులు, నాయకులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి మోదీ రాజ్యసభలో కొనియాడారు. ఆజాద్ వీడ్కోలు సందర్భంగా మాట్లాడిన మోదీ... ఆజాద్ గొప్పదనాన్ని, మానవత హృదయాన్ని గుర్తుచేసుకున్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఓ ప్రమాదం తాలూకు జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ మోదీ కన్నీటి పర్యంతమయ్యారు. ఆజాద్ గొప్పదనాన్ని మాటల్లో వర్ణించలేమంటూ సెల్యూట్ చేశారు. ఆజాద్ లాంటి గొప్ప వ్యక్తి సేవలు రాజ్యసభకు కొనసాగాలని ఆకాంక్షించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com