అటెన్షన్ ప్లీజ్.. అందరూ వినండి.. 6 గంటలకు మీకో విషయం చెప్తా: మోదీ

అటెన్షన్ ప్లీజ్.. అందరూ వినండి.. 6 గంటలకు మీకో విషయం చెప్తా: మోదీ
ఓ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అని ప్రధాని..

ప్రధాని మోదీ ఈ రోజు సాయింత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దయచేసి అందరూ వినాలి.. ఓ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అని ప్రధాని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆయన ఏ విషయంపై మాట్లాడతారు అనేది అందరిలో చర్చకు దారి తీసింది. పండుగలొస్తున్నాయి కదా.. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, జాగ్రత్తలు లాంటివి ఏమైనా చెప్తారేమో అని పలువురు భావిస్తున్నారు. తాజాగా 46,790 కరోనా కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 76 లక్షలకు చేరుకుంది. వైరస్ వ్యాప్తిపై ఇటీవల స్పందించిన కేంద్రం.. వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతుందని వెల్లడించింది.

Tags

Next Story