విజృంభిస్తున్న కరోనా.. ఈనెల 17న అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్ మీటింగ్

దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వర్చువల్ మీటింగ్‌కు సిద్ధమయ్యారు. ఈనెల 17న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని సమీక్షించి.. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా గత వారం నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నాగ్‌పూర్ సహా పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం కానున్నారు.
మరోవైపు కరోనా టీకా పంపిణీపైనా చర్చించే అవకాశముంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 58 రోజులుగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. సుమారు 2 కోట్ల 98 లక్షల మందికి పైగా కోవిడ్ టీకా పంపిణీ చేశారు. టీకా పంపిణీని వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని మోదీ సూచించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com