PM Modi : ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోదీ అత్యవసర భేటీ
PM Modi : ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోదీ అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో భారతీయ విద్యార్ధులపై దాడి అంశంపై చర్చ జరిగింది. భారతీయ విద్యార్ధులకు కాపాడేందుకు... ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్రమంత్రులు వెళ్లాలని ఆదేశించారు ప్రధాని మోదీ. విద్యార్ధుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని కేంద్రమంత్రుల్ని ఆదేశించారు.
ప్రధాని మోదీ ఆదేశాలతో... రుమేనియా, హంగేరీ, పోలాండ్ వెళ్లనున్నారు కేంద్రమంత్రులు. ఆపరేషన్ గంగ పేరుతో... ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల్ని స్వదేశానికి తీసుకొస్తున్నారు. మిగిలిన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఉన్న సమస్యలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇప్పటికే వెయ్యిమందికిపైగా స్వదేశానికి తీసుకొచ్చారు. మిగిలిన వారిని తరలించాల్సి ఉన్నది.
ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పునిత్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో ఇప్పటికే ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com