Narendra Modi : కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సాయం

Narendra Modi : ప్రధాని మోదీ పాలన 8వ వార్షికోత్సవాలను రెండు వారాల పాటు ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి వచ్చే నెల 14 వరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి తీసుకున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రజలను కలవనున్నారు నేతలు.
అటు.. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ స్కీమ్ కింద మార్చి 2020 నుంచి.. ఫిబ్రవరి 28, 2022 మధ్యలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు స్కాలర్ షిప్స్, పీఎం కేర్స్ పాస్ పుస్తకాలు అందిస్తారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు కూడా ఇస్తారు.
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌లో భాగంగా కరోనా బాధిత చిన్నారులకు 18 సంవత్సరాలు వచ్చేసరికి.. వాళ్ల పేరిట 10 లక్షల రూపాయలు ఉండేలా డిపాజిట్ చేస్తారు. ఆ డబ్బుపై వచ్చే వడ్డీని 18 నుంచి 23 ఏండ్ల వరకు వాళ్లకు ఇస్తారు. బాధితుడికి 23 ఏళ్లు రాగానే.. డిపాజిట్ చేసిన 10 లక్షల నగదును లబ్దిదారుడికి అందిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com