Priyanka Gandhi: ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలి: ప్రియాంక డిమాండ్

Priyanka Gandhi: ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలి: ప్రియాంక డిమాండ్
X
Priyanka Gandhi: ఈ విషయమై ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు చెప్పారు.

Priyanka Gandhi: రైతుల మీద ప్రధాని మోడీకి ప్రేమ ఉంటే లక్నోలో జరిగే డీజీపీ, ఐజీల సదస్సుకు ప్రధాని హాజరుకావొద్దన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ. లఖింపూర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాతో వేదిక పంచుకోకూడదన్నారు.

ఈ విషయమై ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు చెప్పారు. అజయ్ మిశ్రా కేంద్ర మంత్రిగా కొనసాగితే బాధిత కుటుంబాలకు న్యాయం జరగదన్నారు. దేశవ్యాప్తంగా రైతులపై పెట్టిన కేసులను కూడా వెనక్కి తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు ప్రియాంక. ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story