Priyanka Gandhi Deeksha : లక్నోలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మౌన దీక్ష..!

Priyanka Gandhi Deeksha : లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించి... కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను డిస్మిస్ చేయాలంటూ... కాంగ్రెస్ నేతల మౌనదీక్ష కొనసాగుతంది. లక్నోలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మౌనవ్రతంలో... యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూతోపాటు శ్రేణులు పాల్గొన్నారు. జీపీఓ పార్క్ వద్ద జరిగిన ధర్నాలో కూడా ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో... కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాపై...కేసు విచారణ స్వేచ్ఛగా, నిష్కాక్షికంగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రిని డిస్మిస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారని ప్రియాంక గాంధీ విమర్శించింది.
అటు ప్రియాంకా వ్యాఖ్యలపై యూపీ బీజేపీ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ మౌనవ్రతం చేపట్టే ప్రజాస్వామ్య హక్కు ఉందని, అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగదని యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com