మహారాష్ట్రకు నెక్ట్స్ సీఎం 'కంగన' అవుతుందేమో: వర్మ

మహారాష్ట్రకు నెక్ట్స్ సీఎం కంగన అవుతుందేమో: వర్మ
ప్రశ్నించాలి.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. అదే చేస్తోంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్..

నటుడు సుశాంత్ మరణం తరువాత నెలకొన్న పరిస్థితులు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా విరుచుకుపడుతోంది. తాజా పరిస్థితులు కంగన వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వంగా సాగుతున్నాయి. సంచలన దర్శకుడు వర్మ ఈ విషయంపై తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. పరిస్థితి చూస్తుంటే కంగన రనౌత్ మహారాష్ట్రకు తదుపరి సీఎం అయ్యేలా ఉంది. అదే జరిగితే బాలీవుడ్ టింబ్ క్ టూ (సైగర్ నది ఒడ్డున ఉన్న ఓ ప్రాంతం)కు మకాం మార్చాలి. కంగన సీఎం, అర్ణబ్ గోస్వామి పీఎం అయిన తరువాత శివసేన అంతర్ధానమవుతుంది. కాంగ్రెస్ ఇటలీకి పారిపోతుంది.. కరోనా సోకిన భారత్ కు, కంగన సోకిన శివసేనకు కూడా వ్యాక్సిన్ లేదు.. అని వర్మ వ్యంగ్యంగా పేర్కొన్నారు.

Tags

Next Story