బండ్ల గణేష్ ట్వీట్.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్

నా దేవుడు వరమిచ్చాడు.. నాకు మరో అవకాశం ఇచ్చాడు.. అని కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశాన్ని సొంతం గణేష్ చేసుకున్నారని ప్రేక్షకులు భావించారు. ఆ ఉద్దేశంతోనే మంచి డైరెక్టర్‌ని సెలెక్ట్ చేసుకోండి, పవన్ ఇచ్చిన ఛాన్స్‌ని వృధా చేసుకోకండి అంటూ చాలా మంది గణేష్‌కి ఉచిత సలహాలు ఇస్తున్నారు.
అంత వరకు బాగానే ఉన్నా అంతకు మించి మరో అడుగు ముందుకు వేసినట్లున్నారు అభిమానులు. దాంతో గణేష్ హర్ట్ అయ్యారు. అదే విషయాన్ని ట్విట్టర్‌లో వ్యక్త పరిచారు. పవన్‌తో తాను తీయబోయే చిత్రం గురించి రోజుకొక పుకారు షికారు చేస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారింది. 'వీపు మీద కొట్టండి.. కానీ దయచేసి కడుపు మీద కొట్టకండి.. ఇది నా విన్నపం.. దయచేసి నేను చెప్పే వరకు ఏ విధమైన వార్తలు రాయొద్దు ఇది నా అభ్యర్థన' అంట్లూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
కాగా, బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'గబ్బర్ సింగ్' సూపర్ డూపర్ హిట్టైంది. మళ్లీ వచ్చే మరో చిత్రం కూడా అదే స్థాయిలో ఉండాలని ఫ్యాన్స్ ఉత్సాహపడుతున్నారు. అందుకే అడక్కపోయినా సలహాలు ఇస్తున్నారు.
వీపుమీద కొట్టండి .కానీ నీ దయ చేసి కడుపు మీద కొట్టకండి ......ఇది నా విన్నపం .నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు నేను చెప్పే వరకు ఇది నా అభ్యర్థన 🙏🙏🙏🙏
— BANDLA GANESH. (@ganeshbandla) October 11, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com