టాలీవుడ్ నిర్మాత 'బన్నీ వాసు' ఇంట విషాదం..

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఇంట విషాదం..
X
ఇంజనీరింగ్ చదివిన సురేష్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

టాలీవుడ్ చిత్ర నిర్మాత బన్నీ వాసు ఇంట విషాదం చోటు చేసుకుంది. వాసు సోదరుడు గవర సురేష్ అనారోగ్యంతో కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో వైద్యులు ఆయనను కాపాడలేకపోయామని తెలిపారు. సురేష్‌కు భార్య , కుమారుడు ఉన్నారు. ఇంజనీరింగ్ చదివిన సురేష్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

డీజిల్, పెట్రోల్‌తో నడిచే వాహనాలను సీఎన్‌జీ (కంప్రెషర్ నేచురల్ గ్యాస్)లోకి కన్వెర్షన్ చేసే కిట్స్ తయారీ కంపెనీ స్థాపించి ఉత్తమ వ్యాపార వేత్తగా ఎదిగారు. ఆయన తమ్ముడు బన్నీ వాసు తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీస్తున్నారు. సురేష అకాల మరణం ఆయన కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.

Tags

Next Story