మట్టి లేకుండా మొక్కల పెంపకం.. కూరగాయల సాగులో ప్రత్యేక శిక్షణ

ఉన్న కొద్ది పాటి స్థలంలో నాలుగు కుండీలు పెట్టి మొక్కలు పెంచేస్తున్నారు.. కిచెన్ గార్డెనింగ్ ఆవశ్యకత నానాటికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మట్టిని వాడకుండా, కొబ్బరి పొట్టుతో కూరగాయల సాగుకు ప్రాముఖ్యత పెరుగుతోంది. శుద్ధి చేసిన కొబ్బరి పొట్టును మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించిన ఆర్క మైక్రోబియల్ కన్సార్షియం ద్రావణంతో పులియబెడితే.. పోషకాలతో కూడిన సేంద్రియ కొబ్బరి పొట్టు సిద్ధమవుతుంది.
ఆగస్టు 13న ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు శిక్షణ ఇవ్వనున్నారు. బెంగళూరు వెళ్లి ప్రత్యక్షంగా శిక్షణ పొందాలనుకుంటే రూ.2000, జామ్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ పొందాలనుకుంటే రూ.500 ఫీజు చెల్లించి, ఆగస్ట్ 11 లోగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆసక్తి గల వారెవరైనా శిక్షణకు అర్హులే. సేంద్రియ ఇంటి పంటల సాగును ఉపాధి మార్గంగా ఎంచుకోదలచిన వారు, స్టార్టప్‌లు, ఎఫ్.పి.ఓలు/వ్యవసాయ/ఉద్యాన విద్యార్ధులు/పట్టభద్రులు ఎవరైనా శిక్షణ పొందొచ్చు. అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
https://forms.gte/tBYyusdJ9DhgvQD6
bessthort@gmail.com
సద్దుపల్లిలో ప్రతి శనివారం రైతులకు శిక్షణ
ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు నాగరత్నం నాయుడు ప్రతి శనివారం తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం (రామోజీ ఫిలిం సిటీకి ఎదురు రోడ్డు) సద్దుపల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతి శనివారం ఉ.10గం. నుంచి సా.4గం. వరకు ఆయన శిక్షణ ఇస్తారు. ఆగస్టు 2 (సోమవారం) ఉ. 11 గంటలకు శిక్షణా తరగతులను ప్రారంభిస్తున్నట్లు 'రైతునేస్తం' వెంకటేశ్వరరావు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com