మాతృభాషను మరిచిన వాడు మనిషే కాదు: వెంకయ్య నాయుడు

అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మాతృభాష ఉన్నతమైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తుందన్నారు. 'భాష కేవలం మాట్లాడుకోవడం కోసమే కాదు.. మన గతం, సంస్కృతిని తెలుసుకునేందుకు ఉపయోగపడును' అని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో పరిపాలన, ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టుల వాదనలు, తీర్పులూ మాతృభాషలో ఉండాలన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వెంకయ్య పలు ట్వీట్స్ చేశారు.
ఒక మహత్తర భాషకు వారసుణ్ని అని చెప్పుకోవడానికి మించిన గర్వకారణం ఏముంటుంది. ఎందుకంటే భాష మన సంస్కృతికి జీవనాడి. ఉన్నతమైన సంస్కృతి... ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుంది. భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతమౌతాయి. #MotherLanguageDay
— Vice President of India (@VPSecretariat) February 21, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com