ఎర్రకోటపై రైతన్న జెండా!

X
By - TV5 Digital Team |26 Jan 2021 3:16 PM IST
దేశ రాజధాని ఢిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. పోలీసుల అనుమతితో ట్రాక్టర్ల ర్యాలీని చేపట్టిన రైతులు కొందరు రూట్ మ్యాప్ మార్చేశారు. సెంట్రల్ ఢిల్లీలోకి చొచ్చుకుపోయారు.
దేశ రాజధాని ఢిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. పోలీసుల అనుమతితో ట్రాక్టర్ల ర్యాలీని చేపట్టిన రైతులు కొందరు రూట్ మ్యాప్ మార్చేశారు. సెంట్రల్ ఢిల్లీలోకి చొచ్చుకుపోయారు. ఎర్రకోట ప్రాంగణానికి కూడా భారీ సంఖ్యలో చేరి ఆందోళన చేపట్టారు. ఎర్రకోట ముందు ఉన్న ఓ స్తంభంపై తమ జెండాలను ఎగురవేశారు. అనంతరం నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎర్రకోట పై తొలిసారి జాతీయ జెండా కాకుండా మరో జెండా ఎగరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా, వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి.
#WATCH A protestor hoists a flag from the ramparts of the Red Fort in Delhi#FarmLaws #RepublicDay pic.twitter.com/Mn6oeGLrxJ
— ANI (@ANI) January 26, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com