ప్రధాని మోదీ మన్‌ కి బాత్‌ కార్యక్రమానికి వ్యతిరేకంగా రైతుల నిరసన

ప్రధాని మోదీ మన్‌ కి బాత్‌ కార్యక్రమానికి వ్యతిరేకంగా రైతుల నిరసన
ఇన్నాళ్లూ రేడియోలో మీరు చెప్తున్నదంతా వినీ వినీ అలసిపోయామని, ఇక చాలు చేయండన్నారు రైతులు.

ప్రధాని మోదీ 72 వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమానికి వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు బోర్డర్‌, ఫరీద్‌కోట్‌, రోహ్‌తక్‌ ప్రాంతాల్లో ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలిపారు. ఇన్నాళ్లూ రేడియోలో మీరు చెప్తున్నదంతా వినీ వినీ అలసిపోయామని, ఇక చాలు చేయండన్నారు. తమ గోడు కూడా వినాలంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లులపై రైతుల నిరసన నేపథ్యంలో స్వరాజ్‌ ఇండియా చీఫ్‌ యోగేంద్ర యాదవ్ ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలపాలని రైతులకు పిలుపునిచ్చారు. దీంతో మన్‌కి బాత్‌కు నిరసనగా.. ఆదివారం పళ్లాలు, డబ్బాలు మోగించారు రైతులు.


Tags

Next Story