Proud ITBP Officer: ఓ తండ్రికి ఇంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది..

Proud ITBP Officer: ఓ తండ్రికి ఇంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది..
Proud ITBP Officer: ఆమె ఆశయాలకు, ఆకాంక్షలకు ఊపిరి పోస్తున్నారు ఆధునిక భావజాలం గల తల్లిదండ్రులు.

Proud ITBP Officer: సమాజం ఎంత మారింది అనుకున్నా అక్కడక్కడా ఇంకా ఆడపిల్ల వివక్షకుగురవుతూనే ఉంది. కొడుకైతేనే ఉద్దరిస్తాడని పై చదువులు చదివించడానికి మొగ్గు చూపే మన సమాజంలో ఇప్పుడు ఆడపిల్లలను కూడా మగ పిల్లలతో సమానంగా చదివిస్తున్నారు.

ఆమె ఆశయాలకు, ఆకాంక్షలకు ఊపిరి పోస్తున్నారు ఆధునిక భావజాలం గల తల్లిదండ్రులు. తాజాగా ఓ అపురూప దృశ్యం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఉన్నతాధిరి కుమార్తె ఒకరు అదే రంగంలో ప్రవేశించి తండ్రి చేత అభినందనలు అందుకుంది.

ఐటీబీపీ ఉద్యోగంలో చేరింది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తరువాత జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌కి ముఖ్య అతిధిగా హాజరై తండ్రికి సెల్యూట్ చేసింది. ఆ క్షణం తండ్రి పొందిన ఆనందం వర్ణించలేనిది. తండ్రి కూమార్తెలిద్దరూ ఒకిరికి ఒకరు సెల్యూట్ చేసుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కన్నబిడ్డల విజయం తల్లిదండ్రులను గర్వించేలా చేసినప్పుడు అది మరింత ప్రత్యేకం అవుతుంది. అలాంటి ఒక ప్రత్యేక క్షణానికి సంబంధించిన చిత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పోలీస్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అపేక్ష నింబాడియా, ఐటీబీపీలో డీఐజీగా పనిచేస్తున్న తన తండ్రి ఏపీఎస్ నింబాడియాకు సెల్యూట్ చేస్తున్న దృశ్యం.

కూతురి విజయాన్ని చూసి గర్వంతో ఉప్పొంగి పోయిన తండ్రి తిరిగి కూతురికి సెల్యూట్ చేస్తున్నాడు. అపేక్ష తన గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొని, తండ్రికి సెల్యూట్ చేసిన దృశ్యం కెమెరాలో బంధించారు ఐటీబీపీ అధికారులు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ ఫోటోలు 18,000కు పైగా లైక్‌లను సంపాదించుకున్నాయి.

అపేక్షా నింబాడియా సివిల్స్‌లో ఉత్తీర్ణ సాధించి.. డీసీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కుటుంబంలో దాదాపు అందరూ సివిల్స్ విజేతలే. ఇప్పుడు మూడో తరం కూడా పోలీస్ విభాగంలో సేవ చేయడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story