Provident Fund: ఉద్యోగులకు శుభవార్త.. 8.5 శాతం వడ్డీకి..

Provident Fund (tv5news.in)

Provident Fund (tv5news.in)

Provident Fund: ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ బాగా ఉపయోగపడేది ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్‌-ఈపీఎఫ్‌.

Provident Fund: ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ బాగా ఉపయోగపడేది ఉద్యోగుల భవిష్యనిధి(ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్‌-ఈపీఎఫ్‌). దీంతో సేవింగ్స్ చేసుకోవడం ఎంత మేలో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీటిపై వడ్డీ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్‌ మరింత ఉపయోగకరంగా మారాయి. ఈ ఏడాదికి ఈపీఎఫ్‌‌పై వడ్డీ రేట్లలో మార్పులు రానున్నాయి.

ఇంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 2020-2021 సంవత్సరానికి ఈపీఎఫ్‌‌పై వడ్డీ మరింత తగ్గనుంది. ఇప్పటివరకు ఈపీఎఫ్‌‌పై వడ్డీ రేట్లు 2013-14, 2014-15లో 8.75శాతం, 2015-16లో 8.8శాతం, 2018-19, 2016-17లో 8.65శాతంగా ఉన్నాయి.

కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాల నుండి ఈపీఎఫ్‌ వడ్డీ రేట్లు 8.5 శాతంగానే ఉన్నాయి. ఈ ఏడాది కూడా అలాగే ఉండనుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story