Nikita Kaul : లెఫ్టినెంట్ గా పుల్వామా వీరుడి సతీమణి.. !

Nikita Kaul : లెఫ్టినెంట్ గా పుల్వామా వీరుడి సతీమణి.. !
X
Nikita Kaul : పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ సతీమణి నిఖితా కౌల్ భారత సైన్యంలో చేరారు. లెఫ్టినెంట్ గా ఆమె ఈరోజు బాధ్యతలు చేపట్టారు.

Nikita Kaul : పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ సతీమణి నిఖితా కౌల్ భారత సైన్యంలో చేరారు. లెఫ్టినెంట్ గా ఆమె ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఉత్తర కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే.జోషీ స్వయంగా ఆమె భుజాలపై నక్షత్రాలు పెట్టి ఆర్మీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కాగా 2019 ఫిబ్రవరిలో కశ్మీర్-పుల్వామా ఉగ్రదాడిలో మేజర్ విభూతి అమరుడయ్యారు. అప్పటికి ఆయనకు వివాహమై 9 నెలలే. 27 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయిన ఆమెను చూసి అందరూ బాధపడ్డారు. కానీ ఆమె మాత్రం జాలి కాదు గర్వపడమని చెప్పారు. భర్త భాద్యతను ఆమె తీసుకున్నారు. ఢిల్లీలో ఉద్యోగాన్ని వదులుకొని న్యంలో చేరేందుకు శిక్షణ తీసుకున్నారు. నేడు లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

Tags

Next Story