PUNE : చైన్ స్నాచర్ల నుంచి అమ్మమ్మను కాపాడిన 10ఏళ్ల బాలిక

X
By - Vijayanand |9 March 2023 6:41 PM IST
అమ్మమ్మను రక్షించుకునే క్రమంలో 10ఏళ్ల రుత్వి దొంగ ముఖంపై దాడి చేసింది. అతని ముఖంపై పదే పదే కొట్టడంతో అతను అక్కడినుంచి పారిపోయాడు
చైన్ స్నాచర్ల నుంచి తన అమ్మమ్మను కాపాడుకుంది ఓ 10ఏళ్ల బాలిక. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. సాయంత్రం 7 గంటల సమయంలో లతా ఘాగ్ అనే వృద్ధురాలు ఇద్దరు మనువరాళ్లతో కలిసి వాకింగ్ కు వెళ్లింది. వీధిలో నడుకుంటూ వెళ్తున్న వీరి వద్దకు ఓ వ్యక్తి వచ్చి అడ్రస్ అడుగుతాడు. సమయం చూసుకుని లతా ఘాగ్ మెడలోని బంగారు గొలుసును లాగుతాడు. తన అమ్మమ్మను రక్షించుకునే క్రమంలో 10ఏళ్ల రుత్వి దొంగ ముఖంపై దాడి చేసింది. అతని ముఖంపై పదే పదే కొట్టడంతో అతను అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రుత్వి చూపిన ధైర్యసాహసాలకు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com