Punjab : ఖలిస్థానీ నేత డిమాండ్లకు తలొగ్గిన పంజాబ్ ప్రభుత్వం

Punjab : ఖలిస్థానీ నేత డిమాండ్లకు తలొగ్గిన పంజాబ్ ప్రభుత్వం
కత్తులు, తుపాకులు వంటి ఆయుధాలు చేపట్టి అమృత్‌పాల్‌ మద్దతుదారులు రెచ్చిపోయారు

ఖలిస్థానీ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ డిమాండ్లకు పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం తలొగ్గింది. అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరుడు లవ్‌ప్రీత్‌ తుఫాన్‌ను విడుదల చేసింది. తన అనుచరుడి విడుదల కోసం అమృత్‌పాల్‌ సింగ్‌ ఏకంగా నిన్న యుద్ధ వాతావరణం సృష్టించాడు. లవ్‌ప్రీత్‌పై నమోదైన కేసును రద్దు చేయాలని.. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. లేకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే కత్తులు, తుపాకులు వంటి ఆయుధాలు చేపట్టి అమృత్‌పాల్‌ మద్దతుదారులు రెచ్చిపోయారు.


పంజాబ్ లో శాంతి భద్రతలు అదుపుతప్పకూడదనే లవ్ ప్రీత్ ను విడుదల చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. పంజాబ్ ప్రభుత్వం లవ్ ప్రీత్ సింగ్ ను విడుదల చేయడంతో విపక్షాలు ఆప్ ప్రభుత్వంపై మండిపడ్డాయి. రాడికల్స్ పై ఆప్ ప్రభుత్వం కావాలనే ఉదాసీనత ప్రదర్శిస్తుందని విమర్శించాయి.

Tags

Read MoreRead Less
Next Story