Punjab : సైనిక శిబిరంలో దుండగుల కాల్పులు, నలుగురు జవాన్లు మృతి

X
By - Vijayanand |12 April 2023 12:05 PM IST
ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది
పంజాబ్‌లోని సైనిక శిబిరంలో కాల్పులు కలకలం రేపాయి. బఠిండాలోని మిలిటరీ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తం అయిన క్విక్ రియాక్షన్ బృందాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. అయితే అప్పటికే నిందితులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. ప్రస్తుతం దుండగుల కోసం వేట కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్‌ను మూసివేసి కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com