Punjab: ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఉ.7.30 గంటలకే ఆఫీస్‌లో ఉండాలి

Punjab: ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఉ.7.30 గంటలకే ఆఫీస్‌లో ఉండాలి
X
ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది పంజాబ్‌ సర్కారు

ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది పంజాబ్‌ సర్కారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదయం 7.30 గంటలకే ఆఫీస్‌లో ఉండాలి. మధ్యాహ్నం 2 గంటలకే ఇంటికి వెళ్లిపోవచ్చంటున్నారు సీఎం భగవంత్‌ మాన్‌. ఉద్యోగులు, ప్రజాసంఘాలతో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ పనివేళలు మే 2 నుంచి జులై 15 వరకు అమలులో ఉండనున్నాయి. ఉద్యోగం చేసుకునే వారు ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఉంటే.. ఉదయమే పూర్తి చేసుకోవచ్చని అన్నారు. సెలవు పెట్టి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేదని చెప్పుకొచ్చారు. వేసవి సీజన్​ను దృష్టిలో పెట్టుకొనే భగవంత్ మాన్ సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Tags

Next Story