ఈ రోజు నుంచే మహిళలకు.. బాలికలకు ఉచిత బస్సు ప్రయాణం

ఈ రోజు నుంచే మహిళలకు.. బాలికలకు ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు ప్రయోజనం చేకూర్చే చర్యగా, అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

పంజాబ్‌లోని మహిళలకు ప్రయోజనం చేకూర్చే చర్యగా, అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించాలన్న ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా 1.31 కోట్లకు పైగా ఉన్న మహిళలు/బాలికలకు లబ్ధి చేకూర్చేలా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పంజాబ్ జనాభా 2.77 కోట్లు (పురుషులు 1,46,39,465, స్త్రీలు 1,31,03,873).

ఈ పథకం కింద, రాష్ట్ర మహిళలు ఏప్రిల్ 1 నుండి పంజాబ్ రోడ్‌వేస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (పిఆర్‌టిసి), పంజాబ్ రోడ్‌వేస్ బస్సులు (పన్‌బస్) మరియు స్థానిక సంస్థలచే నిర్వహించబడుతున్న సిటీ బస్సు సర్వీసులతో సహా ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సులలో ఉచిత ప్రయాణ సేవలను పొందవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

మార్చి8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సాధికారత, పరిరక్షణ లక్ష్యంగా ఎనిమిది కొత్త పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది.

Tags

Next Story