Bhagwant Mann : జైళ్లలో ఇక వీఐపీ గదులుండ‌వ్.. పంజాబ్ సీఎం కీలక నిర్ణయం

Bhagwant Mann : జైళ్లలో ఇక వీఐపీ గదులుండ‌వ్..  పంజాబ్ సీఎం కీలక నిర్ణయం
Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. జైళ్లలోని అన్ని వీఐపీ గదులను మూసివేసి మేనేజ్ మెంట్ బ్లాక్‌లుగా మార్చాలని ఆదేశించారు.

Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. జైళ్లలోని అన్ని వీఐపీ గదులను మూసివేసి మేనేజ్ మెంట్ బ్లాక్‌లుగా మార్చాలని ఆదేశించారు. జైలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులను బాధ్యులను చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జైలు ప్రాంగణంలో గ్యాంగ్‌స్టర్ల 710 మొబైల్ ఫోన్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ సీఎం చెప్పారు.

దీనితో పాటు లోపల ఫోన్‌లను తీసుకున్న వారిపై కూడా చర్యలు తీసుకున్నామని, దీనిపై విచారణ చేసేందుకు సిట్ ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.. వారి పైన ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేస్తున్నామని, కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేశామని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగా, సీఎంగా భ‌గ‌వంత్ మాన్ బాధ్యత‌లు చేపట్టారు.. సీఎంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

Tags

Next Story