Lottery : వృద్ధుడి ఆనందం.. లాటరీలో రూ.5 కోట్లు

Lottery : వృద్ధుడి ఆనందం.. లాటరీలో రూ.5 కోట్లు
Lottery : పంజాబ్‌లోని డేరా బస్సీలో 88 ఏళ్ల వృద్ధుడికి రూ.5 కోట్ల లాటరీ తగిలి రాత్రికి రాత్రే 'కోటీశ్వరుడు' అయ్యాడు.

Lottery : పంజాబ్‌లోని డేరా బస్సీలో 88 ఏళ్ల వృద్ధుడికి రూ.5 కోట్ల లాటరీ తగిలి రాత్రికి రాత్రే 'కోటీశ్వరుడు' అయ్యాడు. దేరాబస్సీలోని త్రివేది క్యాంపులో నివసించే మహంత్ ద్వారకా దాస్.. లోహ్రీ మకర సక్రాంతి బంపర్ లాటరీని గెలుచుకున్నాడు. ఈ వార్త ఊరంతా వ్యాపించడంతో గ్రామస్థులు అతడిని అభినందిస్తున్నారు.లాటరీలో వచ్చిన డబ్బును నా ఇద్దరు కొడుకులకు పంచుతాను. గత 35-40 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాను.. ఇప్పటికి అదృష్ట దేవత వరించింది అని ద్వారకా దాస్ ఆనందంతో చెబుతున్నాడు. అతని కుమారుడు నరేందర్ కుమార్ శర్మ మాట్లాడుతూ, "మా నాన్న నా మేనల్లుడికి లాటరీ టిక్కెట్ కొనడానికి డబ్బు ఇచ్చాడు. లాటరీ తగలడంతో మేము సంతోషంగా ఉన్నాము అని అన్నాడు.జిరాక్‌పూర్‌లో లాటరీ వ్యాపారం చేస్తూ, ఆ టిక్కెట్టును కుటుంబానికి విక్రయించిన లోకేష్, పన్ను మినహాయింపు తర్వాత ద్వారకా దాస్‌కు సుమారు రూ. 3.5 కోట్లు వస్తాయని పేర్కొన్నాడు. "పంజాబ్ స్టేట్ లోహ్రీ మకర సంక్రాంతి బంపర్ లాటరీ 2023 ఫలితాలు జనవరి 16న ప్రకటించబడ్డాయి. ద్వారకా దాస్ మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత, 30% పన్ను మినహాయించి మిగిలిన మొత్తం అతనికి ఇవ్వబడుతుంది" అని అసిస్టెంట్ లాటరీ డైరెక్టర్ కరమ్ సింగ్ చెప్పారు.

Tags

Next Story