Punjabi singer Alfaaz: హనీసింగ్ సోదరుడిపై హత్యా యత్నం.. పరిస్థితి ప్రమాదకరం..

Punjabi singer Alfaaz: యో యో హనీ సింగ్ సోదరుడు, ప్రఖ్యాత పంజాబీ గాయకుడు అల్ఫాజ్ అలియాస్ అమంజోత్ సింగ్ పన్వార్ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు తెలిపారు. హిర్దేశ్ సింగ్ అలియాస్ హనీ సింగ్ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. నిందితులను పట్టుకున్నందుకు పంజాబ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నేరం జరిగినప్పుడు గాయకుడు పంజాబ్‌లోని మొహాలీలో రోడ్డు పక్కన ఉన్న ఛాట్ భండార్‌కు వెళ్లాడు. తిరిగి కారు వద్దకు వచ్చినప్పుడు నిందితులు అతడిపై దాడి చేశారు.
గాయకుడు తన స్నేహితులు గుర్‌ప్రీత్, తేజీ, కుల్జీత్‌లతో కలిసి పాల్ ధాబాలో భోజనం చేసి బయటకు వస్తున్నారు. డబ్బుల విషయమై ఛాట్ భండార్ యజమానికి అల్ఫాజ్‌కు మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.
హనీ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గాయపడిన అల్ఫాజ్ చిత్రాన్ని షేర్ చేస్తూ, "నా సోదరుడు అల్ఫాజ్‌పై నిన్న రాత్రి దాడి జరిగింది. ఎవరు ప్లాన్ చేసినా... నిన్ను నేను పోగొట్టుకోను... అందరూ దయచేసి నా సోదరుడి కోసం ప్రార్థించండి." అని పేర్కొన్నాడు.
మరో పోస్ట్‌లో, "గత రాత్రి @itsaslialfaaz రోడ్డుపై టెంపో ట్రావెలర్‌తో అల్ఫాజ్‌ను ఢీకొట్టిన నిందితులను పట్టుకున్న మొహాలీ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు అని హనీ సింగ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com